Supreme court: యూట్యూబ్‌లో అశ్లీల ప్రకటనలు చూసి పరీక్ష తప్పా.. మధ్యప్రదేశ్‌ వాసి పిటిషన్‌

యూట్యూబ్‌లో కనిపించిన అశ్లీల వాణిజ్య ప్రకటనల కారణంగా తాను పోటీ పరీక్షల్లో విఫలమయ్యానని, అందువల్ల తనకు రూ.75 లక్షల పరిహారాన్ని ‘గూగుల్‌ ఇండియా’తో ఇప్పించాలంటూ వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 10 Dec 2022 07:58 IST

ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: యూట్యూబ్‌లో కనిపించిన అశ్లీల వాణిజ్య ప్రకటనల కారణంగా తాను పోటీ పరీక్షల్లో విఫలమయ్యానని, అందువల్ల తనకు రూ.75 లక్షల పరిహారాన్ని ‘గూగుల్‌ ఇండియా’తో ఇప్పించాలంటూ వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇంటర్నెట్‌ ప్రకటనలు చూసి పోటీ పరీక్షల్లో విఫలమయ్యారా.. మిమ్మల్ని ప్రకటనలెవరు చూడమన్నారు? ఇంతకంటే ఘోరమైన పిటిషన్‌ ఉండదు. ఇలాంటి వాటితో న్యాయవ్యవస్థ సమయం వృథా అవుతోంది’’ అని శుక్రవారం వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు వేయడం సమంజసం కాదని పేర్కొంది. మధ్యప్రదేశ్‌ వాసి అయిన పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. తాను నిరుద్యోగినని ఆ వ్యక్తి పేర్కొనడంతో జరిమానాను రూ.25 వేలకు తగ్గించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని