Cow Dung: ‘ఆవుపేడ’ అని పిలుస్తున్నందుకు గర్వంగా ఉంది: ఎంపీ సురేష్‌ గోపి

‘‘నన్ను ‘ఆవుపేడ’ అని పిలుస్తున్నందుకు సిగ్గుపడటం లేదు. నిజం చెప్పాలంటే గర్వంగా ఉంది’’ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు నటుడు, భాజపా రాజ్యసభ సభ్యుడు సురేష్‌ గోపి. ఇటీవలే కొచ్చిలోని కాలూర్‌లో విశ్వహిందు పరిషత్‌(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోవు రక్ష యాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Published : 21 Aug 2021 01:32 IST

కొచ్చి: ‘‘నన్ను ‘ఆవుపేడ’ అని పిలుస్తున్నందుకు సిగ్గుపడటం లేదు. నిజం చెప్పాలంటే గర్వంగా ఉంది’’ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు నటుడు, భాజపా రాజ్యసభ సభ్యుడు సురేష్‌ గోపి. ఇటీవలే కొచ్చిలోని కాలూర్‌లో విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోవు రక్ష యాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘ్‌ పరివార్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు గానూ కొందరు సోషల్‌ మీడియాలో గ్రూపులుగా ఏర్పడి సురేష్‌ గోపి ‘ఆవుపేడ’ అని విమర్శలు చేయడం ప్రారంభించారు. అయినా సరే వాటిని పట్టించుకోనని, అనే వాళ్లు ఎన్ని అయినా అనుకోండి అంటూ విమర్శకులకు బదులిచ్చారు. స్వామి వివేకానంద కల్చరల్‌ సొసైటీతో వీహెచ్‌వీ అనుసంధానమై కేరళలో ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోవుల సంరక్షణ, సేంద్రియ సాగు, పాల ఉత్పత్తి పెంచడంతో పాటు ప్రజలు సంప్రదాయమైన జీవనశైలిని అలవరచుకునేలా ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని