పేకమేడలా కూలిన భవంతి

అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో పాక్షికంగా కూలిపోయిన భవనాన్ని బాంబుల సాయంతో

Published : 05 Jul 2021 14:53 IST

24 మంది మృతి.. 121 మంది గల్లంతు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో పాక్షికంగా కూలిపోయిన భవనాన్ని బాంబుల సాయంతో అక్కడి సిబ్బంది కూల్చివేశారు. భవనం కూలిన సమయంలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతుకాగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాలను తొలగించే పనిని వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. భవనం పాక్షికంగా కూలడం వల్ల అందులోకి వెళ్లలేకపోయిన సహాయ సిబ్బంది నిపుణుల సాయంతో భవనాన్ని నేలమట్టం చేశారు. ఇందుకోసం చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 121 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని