‘ఆయన, స్థానికుల వల్లే బతికున్నాం’

పైలట్ కెప్టెన్‌ తెలివిగా వ్యవహరించడం వల్లే తాము ప్రాణాలతో ఉన్నామని కేరళలోని కొలికోడ్‌లో విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు అన్నారు.

Published : 08 Aug 2020 16:19 IST

 ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుల వెల్లడి

కొలికోడ్: పైలట్ కెప్టెన్‌ తెలివిగా వ్యవహరించడం వల్లే తాము ప్రాణాలతో ఉన్నామని కేరళలోని కొలికోడ్‌లో విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు అన్నారు. ప్రమాదం తరవాత మంటలు చెలరేగకుండా పైలట్ చాకచక్యంగా స్పందించారని చెప్పారు. అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్, ప్రమాదం గురించి తెలియగానే వెంటనే స్పందించిన స్థానికుల వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని ఘటనను తలుచుకొని భయాందోళనలకు గురయ్యారు. సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరేలోపే అక్కడున్న ప్రజలు పొగ, చిన్నపాటి మంటలను లెక్కచేయకుండా, తమను బయటకు తీసుకువచ్చారని కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, చురుగ్గా స్పందించిన కెప్టెన్‌ దీపక్‌ సాథే మాత్రం ఈ విమాన ప్రమాదంలో మరణించారు. 

కరోనా మహమ్మారి కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం నిర్వహించిన ‘వందే భారత్ మిషన్’లో భాగంగా గమ్యస్థానానికి చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ రన్‌వే మీద అదుపుతప్పి, లోయలోపడిపోయింది. ప్రమాదానికి గురైన విమానంలో చిన్నారులు, సిబ్బందితో కలిపి 190 మంది ఉండగా..వారిలో 19 మంది మరణించారని విమానయాన శాఖ అధికారులు తెలిపారు. 23 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

నా చేతులు, చొక్కా రక్తంతో తడిసిపోయాయి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని