Bhagwant Mann: అమెరికాలో భగవంత్‌ మాన్ కుమార్తెకు బెదిరింపులు..?

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్ మాన్(Bhagwant Mann) కుమార్తెకు బెదిరింపులు వచ్చినట్లు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. 

Published : 31 Mar 2023 22:40 IST

చండీగఢ్‌: ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh)ను అదుపులోకి తీసుకునేందుకు పంజాబ్‌ ప్రభుత్వం తీవ్రంగా గాలిస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌(Bhagwant Mann) కుమార్తెకు బెదిరింపులు వచ్చాయని దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతిమాలీవాల్ వెల్లడించారు. అమెరికాలో ఉన్న ఆమెకు భద్రత కల్పించాలని భారత ఎంబసీని కోరారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించారు.

‘అమెరికాలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ కుమార్తెను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయంటూ వెలువడిన నివేదికలను చూశాను. ఇది అత్యంత పిరికిపందచర్య. ఆమె భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని అమెరికాలోని భారత ఎంబసీని అభ్యర్థిస్తున్నాను’ అని స్వాతి మాలీవాల్‌ పోస్టు పెట్టారు. భగవంత్‌మాన్‌కు మొదటి వివాహం ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారు  ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆ చిన్నారులపై బెదిరింపులు రావడాన్ని పలువురు ఖండిస్తున్నారు.

అమృత్‌పాల్‌ కోసం పంజాబ్‌(Punjab) పోలీసులు గాలింపును ఉద్ధృతం చేశారు. హోశియార్‌పుర్‌ జిల్లాలోని మర్నైయన్‌ గ్రామ సమీపంలో డ్రోన్‌ను రంగంలోకి దింపి అణువణువూ గాలిస్తున్నారు. ఇంకోపక్క..పరారీలో ఉన్న ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ మాట్లాడిన ఆడియో క్లిప్‌ ఒకటి గురువారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. తాను లొంగిపోవడానికి సిద్ధమై కొందరితో చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలను అతడు అందులో ఖండించాడు. అరెస్టవడానికి కొన్ని షరతులను పెట్టినట్లు వస్తున్న ఊహాగానాలూ నిజం కాదని ప్రకటించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు