Anant - Radhika: అనంత్‌- రాధిక సంగీత్‌లో టీ20 హీరోలకు గ్రాండ్‌ వెల్‌కమ్‌

Anant - Radhika: అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ సంగీత్‌ వేడుకలో టీ20 ప్రపంచకప్‌ హీరోలకు అరుదైన గౌరవం లభించింది.

Updated : 06 Jul 2024 15:47 IST

Anant - Radhika | ముంబయి: అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ (Anant - Radhika) వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా సంగీత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో టీ20 ప్రపంచ కప్‌ విజేతలకు అరుదైన గౌరవం లభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూర్య కుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యను వేదికపై సాదరంగా ఆహ్వానించి అభినందించారు. అక్కడున్న వారంతా చప్పట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఈ ముగ్గురూ ముంబయి ఇండియన్స్‌ జట్టులో సభ్యులు కావడం విశేషం.

బుల్లి వారసులతో ముకేశ్‌-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?

సంగీత్‌ వేడుకల్లో భాగంగా నీతా అంబానీ ఈ ముగ్గురు క్రికెటర్లను వేదికపైకి పిలిచారు. తొలుత రోహిత్‌ శర్మను, తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ను నీతా వేదికపైకి వరుసగా  ఆహ్వానించారు. వారికి స్వాగతం పలికేటప్పుడు టీ20 ప్రపంచకప్‌లో వారి ఘనతలను ప్రస్తావించారు. వేదికపైకి వచ్చాక వారిని హత్తుకున్నారు. ఈ క్రమంలో ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. పాండ్య గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘కఠిన సమయాలు నిరంతరం ఉండవు. కానీ, వాటికి ఎదురు నిలిచినవారే ముందుకు సాగగలరు’ అంటూ పాండ్యపై వచ్చిన విమర్శలను ఉద్దేశించి అన్నారు. వేదికపైకి వచ్చిన తర్వాత ముకేశ్‌ అంబానీ సైతం క్రికెటర్లను అభినందించారు. 2011 తర్వాత ప్రపంచకప్‌ను దేశానికి అందించి దేశం గర్వపడేలా చేశారంటూ కితాబిచ్చారు. అంతకుముందు జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో ముకేశ్‌ అంబానీ కుటుంబ సభ్యులు ఆటాపాటలతో అలరించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్ చక్కర్లు కొడుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని