Udaipur Murder: ఉదయ్‌పుర్ దర్జీ హత్య కేసు.. కోర్టు ప్రాంగణంలో నిందితులపై దాడి..!
జైపూర్: రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్య కుమార్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాశవికంగా వ్యవహరించిన నిందితులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వీరిని పోలీసులు శనివారం కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ప్రాంగణంలో పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలు వారిపై దాడికి పాల్పడ్డారు.
ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. దానిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను అధికారులు జైపూర్‌లోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ప్రాంగణంలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అక్కడే గుమిగూడిన ప్రజలు వీరిపై దాడికి పాల్పడ్డారు. న్యాయవాదులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కన్హయ్య హంతకులకు మరణశిక్ష విధించండి, పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. కాగా, కోర్టు ఈ నిందితులను జులై 12 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.
ఉదయ్‌పుర్‌కు చెందిన కన్హయ్యలాల్‌ను పట్టపగలే ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమేగాక.. ప్రధానిని కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిని రాజకీయ నాయకులు, ప్రముఖులు ఖండించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Har Ghar Tiranga: ఇంటింటా హర్ ఘర్ తిరంగా.. సతీమణితో కలిసి జెండా ఎగరవేసిన అమిత్ షా
-
Movies News
Vikram: నిజంగా నేనే వచ్చా.. డూపు కాదు: విక్రమ్
-
General News
Chandrababu: హర్ ఘర్ తిరంగా.. ఓ పవిత్రమైన కార్యక్రమం: చంద్రబాబు
-
Movies News
F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
-
World News
Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
-
Sports News
IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్‌పై రికీ పాంటింగ్ జోస్యం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!