Published : 29 Jun 2022 02:44 IST

Udaipur: పట్టపగలే టైలర్‌ దారుణ హత్య.. ఉదయ్‌పూర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌..

ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ధన్‌ మండీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ టైలర్‌ను ఇద్దరు నిందితులు దారుణంగా హత్య చేశారు. తొలుత ఓ నిందితుడు టైలర్‌పై పదునైన ఆయుధంతో తల నరకగా.. ఈ దుశ్చర్యను మరో నిందితుడు తన మొబైల్‌ ఫోన్‌లో వీడియో రికార్డు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాసేపటి తర్వాత తామే ఈ హత్య చేసినట్టు అంగీకరిస్తూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో రెండు వర్గాల మధ్య కొనసాగిన పోస్ట్‌లతో టైలర్‌ హత్యకు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ మర్డర్‌ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని, పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. టైలర్‌ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌కు సంబంధించి కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు సమాచారం.

ఈ దారుణ హత్యతో స్థానికంగా మార్కెట్లు మూతపడ్డాయి. నిందితులను అరెస్టు చేయాలంటూ వ్యాపారులు డిమాండ్‌ చేస్తూ నిరసనలకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనను సీఎం అశోక్‌ గహ్లోత్‌ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత బాధాకరమని, తీవ్ర అవమానకరమైనదిగా పేర్కొన్నారు. ఈ దారుణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేయొద్దని ప్రజలను కోరారు. వీడియో షేర్‌ చేయడం ద్వారా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టాలనుకొనే నేరగాళ్ల ఉద్దేశం నెరవేరుతుందన్నారు. మరోవైపు, ఉదయ్‌పూర్‌లో 24గంటల పాటు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. అదనంగా దాదాపు 600 మంది పోలీసులను మోహరించినట్టు సమాచారం.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని