Taiwan vs china: చైనా ఒత్తిళ్లకు తలొగ్గం..: తైవాన్‌

చైనా ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గమని తైవాన్‌ తేల్చి చెప్పింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే.   తైవాన్‌ నేషనల్‌ డే సందర్భంగా అధ్యక్షురాలు త్సాయి

Updated : 11 Oct 2021 04:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గమని తైవాన్‌ తేల్చి చెప్పింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే.  ఆదివారం తైవాన్‌ నేషనల్‌ డే సందర్భంగా అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌ వెన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చైనా నుంచి ఒత్తిళ్లు పెరిగే కొద్దీ మేము మరింత పురోగతి సాధిస్తుంటాము. చైనా మాకు చూపిస్తున్న మార్గంలో వెళ్లమని మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. ప్రజాస్వామ్య రక్షణకు తైవాన్‌ ముందు వరుసలో ఉంటుంది. బీజింగ్‌తో సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తేలికపడతాయని.. ఆ దేశం దుందుడుకుగా వ్యవహరించదని ఆశిస్తున్నాను. తైవాన్‌ ప్రజలు చైనా ముందు తలొగ్గుతారని మాత్రం ఊహించుకోవద్దు’’ అని త్సాయి పేర్కొన్నారు. తైవాన్‌-చైనాలను ఏకం చేసి తీరతామని శనివారం జిన్‌పింగ్‌ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పే తీరులో త్సాయి ప్రసంగం సాగింది.  

మరోపక్క జిన్‌పింగ్‌ హెచ్చరికలు..

డాక్టర్‌ సన్‌యెట్‌ సేన్‌ నేతృత్వంలోని జాతీయ ఉద్యమం చైనాలో రాజరిక పాలనను అంతమొందించి 110 ఏళ్లు నిండిన సందర్భంగా బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ శనివారం ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రధాన భూభాగంలో తైవాన్‌ అంతర్భాగమేనని ఉద్ఘాటించారు. ద్వీప దేశ స్వతంత్రతకు మద్దతు తెలిపే శక్తులకు మంచి ముగింపు ఉండదని పరోక్షంగా హెచ్చరించారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని