Taliban attack Panjshir: అమెరికన్లు అటు వెళ్లగానే.. పంజ్‌షీర్‌పై దాడికి యత్నం..!

అమెరికన్లు అఫ్గాన్‌ను వీడిన వెంటనే తాలిబన్లు పంజ్‌షీర్‌పై దృష్టి పెట్టారు. సోమవారం అర్ధరాత్రి తాలిబన్లు పంజ్‌షీర్‌లోకి అడుగు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని

Published : 01 Sep 2021 01:22 IST

 8 మంది తాలిబన్ల మృతి

ఇంటర్నెట్‌డెస్క్‌:  అమెరికన్లు అఫ్గాన్‌ను వీడిన వెంటనే తాలిబన్లు పంజ్‌షీర్‌పై దృష్టి పెట్టారు. సోమవారం అర్ధరాత్రి తాలిబన్లు పంజ్‌షీర్‌లోకి అడుగు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ బలగాలు తిప్పి కొట్టాయి. ఈ విషయాన్ని అహ్మద్‌ మసూద్‌ ప్రతినిధి ఫహిమ్‌ దస్తీ పేర్కొన్నారు. తాలిబన్లు తమ ఔట్‌పోస్టుపై దాడి చేసిన క్రమంలో జరిగిన పోరాటంలో ఇరు పక్షాల వైపు పలువురు గాయపడ్డారని ఆయన వెల్లడించారు. తాలిబన్ల వైపు 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. రెసిస్టెన్స్‌ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు కూడా గాయపడ్డారన్నారు. పంజ్‌షీర్‌ వాసులు కేవలం లోయ కోసమే పోరాడటంలేదని.. పూర్తి అఫ్గాన్‌ కోసం పోరాడుతున్నారని ఫాహిమ్‌ పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, మైనార్టీలకు తాలిబన్లు హక్కులు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసిన తాలిబన్లు..

ఈ దాడికి ఒక్క రోజు ముందు తాలిబన్లు పంజ్‌షీర్‌కు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే ట్విటర్‌ వాడకుండా అడ్డుకొనేందుకు వారు ఇలా చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని