
Human rights: ‘పంజ్‌షేర్ లోయలో హక్కుల ఉల్లంఘన జరగలేదు’
క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు అనుమతిస్తాం: తాలిబన్లు
కాబుల్: అఫ్గాన్‌లో తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న రాజధాని కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న వారు.. ఇటీవల పంజ్‌షేర్ లోయనూ ఆక్రమించినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో లోయలో పెద్దఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. వీటిని తాలిబన్ల ప్రతినిధి, సమాచార, సాంస్కృతికశాఖ డిప్యూటి మినిస్టర్ జబిహుల్లా ముజాహిద్ ఖండించారు. మంగళవారం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పంజ్‌షేర్ ప్రావిన్స్‌లో తాలిబన్ ఫైటర్లు ఎలాంటి యుద్ధ నేరాలకు పాల్పడలేదని తెలిపారు. ఈ ఆరోపణలపై క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు మానవ హక్కుల సంస్థలకు అనుమతి ఇస్తామని వెల్లడించారు. కానీ, ఈ అవకాశాన్ని కల్పిత సమాచార వ్యాప్తికి వినియోగించకూడదని షరతు విధించారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు పంజ్‌షేర్‌లోని పలు ప్రాంతాల్లో ఇంకా రెసిస్టెన్స్ ఫోర్సెస్, తాలిబన్లకు మధ్య భీకర పోరు సాగుతున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. తాజాగా అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను తాలిబన్లు హతమార్చినట్లు వార్తలు వచ్చాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.