
Afghan Crisis: కర్జాయ్‌తో తాలిబన్ నేతల భేటీలు.. అక్కడ ఘనీ స్థానంలో అమ్రుల్లా ఫొటో!
కాబుల్: అఫ్గానిస్థాన్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా తాలిబన్లు జోరుగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ దేశాన్ని తమ స్వాధీనం తెచ్చుకున్న తాలిబన్ ఫైటర్లు పలువురు నేతలతో చర్చలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మరో కీలక నేత డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా, ఫజల్ హది మస్లిమయర్ తదితర నేతలతో తాలిబన్ నేత ఆమిర్‌ఖాన్ ముత్తకీ ఇప్పటికే పలుమార్లు భేటీ కాగా.. తాజాగా మరో నేత అనాస్ హక్కనీ వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాలిబనేతర నేతలకూ కొత్త ప్రభుత్వంలో చోటు కల్పించడంతో పాటు గత 20 ఏళ్లలో మహిళలకు సంక్రమించిన హక్కులను పరిరక్షించే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో చర్చలు కొలిక్కి వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తజక్ ఎంబసీలో ఘనీ ఫొటో తొలగింపు
మరోవైపు, తాలిబన్ల ఆక్రమణతో దేశం విడిచి పారిపోయిన అఫ్గన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చిత్రపటాన్ని తజికిస్థాన్ రాయబార కార్యాలయంసిబ్బంది తొలగించారు. ఆయన ఫొటో స్థానంలో అమ్రుల్లా సలేహ్ చిత్రపటాన్ని ఉంచడం గమనార్హం. ఘనీ దేశం విడిచి పారిపోవడంతో అఫ్గన్ రాజ్యాంగం ప్రకారం తానే ఆ దేశానికి ఆపద్ధర్మ అధ్యక్షుడినంటూ అమ్రుల్లా నిన్న ట్విటర్లో ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.