Afghanistan: తాలిబన్లను ప్రశంసించిన ఇమ్రాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గాన్‌ పాలన తాలిబాన్ల వశమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్పందించారు. ‘తాలిబాన్లు అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవడం అనేది.. బానిసత్వ సంకెళ్లను తెంచడం లాంటిదేన’ని పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమ..

Published : 16 Aug 2021 23:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గాన్‌ పాలన తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్పందించారు. ‘తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవడం అనేది.. బానిసత్వ సంకెళ్లను తెంచడం లాంటిదేన’ని పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమ బోధన, పాశ్చాత్య సంస్కృతి తదితర అంశాలను ఆయన ఉటంకిస్తూ.. ‘వేరే ఇతర దేశాల సంస్కృతులను అలవర్చుకుని, దానికి లోబడటం అనేది బానిసత్వం కంటే ఘోరమైనది.  ఈ విధమైన బానిసత్వ సంకెళ్లను తెంచడం కష్టం. కానీ.. ప్రస్తుతం అఫ్గాన్‌లో జరిగిందేమిటి! వారు దీన్ని చేసి చూపించార’ని వ్యాఖ్యానించడం గమనార్హం. పాక్‌ మొదటినుంచే తాలిబాన్లకు పరోక్షంగా మద్దతుగా నిలుస్తోందనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అఫ్గాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ క్రమంలో అక్కడి పౌరులు.. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల హక్కుల విషయంలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని