ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఇసుక కోట!

చిన్నప్పుడు మీరు బీచుల్లో ఇసుకతో కోటలు నిర్మించే ఉంటారు కదా! ఇందుకోసం కోసం ఎంతో శ్రద్ధ.. ఓపిక అవసరం. నిర్మాణంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కోట కుప్పకూలిపోతుంది. ప్రయత్నించినా మహా అయితే ఒక అడుగు ఎత్తులో ఇసుకతో కోటను నిర్మించగలం. కానీ, డెన్మార్క్‌లో తాజాగా ప్రపంచంలోనే

Published : 12 Jul 2021 23:35 IST


(Photo Credit: Sumner @diamondlass99 twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నప్పుడు మీరు బీచుల్లో ఇసుకతో కోటలు నిర్మించే ఉంటారు కదా! ఇందుకోసం కోసం ఎంతో శ్రద్ధ.. ఓపిక అవసరం. నిర్మాణంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కోట కుప్పకూలిపోతుంది. ఎంత ప్రయత్నించినా మహా అయితే ఒక అడుగు ఎత్తులో ఇసుకతో కోటను నిర్మించగలం. కానీ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఇసుక కోట డెన్మార్క్‌లో నిర్మితమైంది. సముద్ర తీరంలోని బ్లోకస్‌ అనే ప్రాంతంలో 21.16 మీటర్ల (69.4 అడుగులు) ఎత్తుతో పిరమిడ్‌ ఆకృతితో రూపకర్తలు ఈ కోటను నిర్మించారు. ఇందుకోసం 4,860 టన్నుల ఇసుకను ఉపయోగించారట. కోట పైభాగాన కిరీటం ధరించిన కరోనా వైరస్‌ ఉండటం గమనార్హం. దీన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. 2019లో జర్మనీలో ఒకరు ఇలాగే అత్యంత ఎత్తయిన ఇసుక కోటను నిర్మించి రికార్డు సృష్టించారు. దాని కంటే మూడు మీటర్లు ఎక్కువ ఎత్తులో ఈ కోటను నిర్మించి.. గత రికార్డును బద్దలు కొట్టారు.

ఈ ఇసుక కోట రూపకర్త విల్‌ఫ్రెడ్‌ స్టైగర్‌.. 30 మంది ఉత్తమ సైకతశిల్పుల సాయంతో దీన్ని నిర్మించారు. గత కొన్నాళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.. అందర్ని శాసిస్తోంది. అందుకే, దానికున్న శక్తిని ప్రతిబింబించేలా కోట పైభాగాన వైరస్‌ ఆకృతి నిర్మించి దానికి కిరీటం పెట్టాను అని విల్‌ఫ్రెడ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని