Ebike: మార్గమధ్యంలో ఆగిపోయిందని కొత్త స్కూటీని తగలబెట్టాడు...

ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రికల్‌ బైక్‌లు దగ్ధమవుతున్న విషయం తెలిసిందే.

Published : 27 Apr 2022 11:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల కాలంలో పలు చోట్ల ఎలక్ట్రికల్‌ బైక్‌లు దగ్ధమవుతున్న వార్తలు చూస్తున్నాం. అయితే ఓ వ్యక్తి తన ఎలక్ట్రికల్‌ స్కూటీ మార్గమధ్యంలో ఆగిపోయిందని దానికి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని అంబూర్‌ ప్రాంతానికి చెందిన పృథ్వీరాజ్‌ ఇటీవల ఓ ఈ-స్కూటీని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్‌ కోసం సమీపంలోని వాహన రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అధికారులు ఆ వ్యక్తి ఉంటున్న ప్రాంతం ఆ కార్యాలయం పరిధిలోకి రాదని.. 50కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడియాట్టమ్‌ లోని ఆర్‌టీవో కార్యాలయానికి వెళ్లాలని కోరారు. అక్కడకు వెళ్తుండగా మార్గమధ్యంలో స్కూటీ ఆగిపోయింది. దీంతో కోపం వచ్చి స్కూటీని తగలపెట్టాడు.

దీనిపై పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ ‘మార్గమధ్యంలో నా స్కూటీ ఆగిపోయిందని కంపెనీ వాళ్లకి పోన్‌ చేశాను. రెండు గంటలైనా వాళ్ల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. వీడియో సందేశాన్ని కూడా పంపాను. అయినా స్పందించలేదని’ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని