SM Nasar: కుర్చీ తేలేదని.. కార్యకర్తలపై రాయి విసిరిన మంత్రి..

తమిళనాడు(Tamil Nadu)కు చెందిన మంత్రి కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలో రాయి తీసుకొని విసిరారు. 

Published : 24 Jan 2023 17:51 IST

చెన్నై: కెమెరా ఎదురుగానే తమిళనాడు(Tamil Nadu)కు చెందిన మంత్రి సహనం కోల్పోయారు. తనకు కుర్చీ తేవడంలో ఆలస్యమైందని కార్యకర్తలపై మండిపడ్డారు. అంతటితో ఆగకుండా వారిపై రాయి విసిరారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మామూలుగా సభల్లో పాల్గొన్న నేతలపై రాళ్లు విసిరిన, ఇంకు చల్లిన ఘటనలు మనం చూస్తుంటాం. కానీ తమిళనాడు(Tamil Nadu) మంత్రి ఎస్‌ఎం నాజర్(SM Nasar) విషయంలో అది రివర్స్ అయింది. ఆయనే కార్యకర్తలపై రాయి విసిరారు. తిరువళ్లూరులో బుధవారం జరగనున్న సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆ మంత్రి వచ్చారు. ఆ సభకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హాజరుకానున్నారు. ఏర్పాట్లు చూస్తున్న ఆయనకు కుర్చీ వేయడంలో ఆలస్యం అయింది. దాంతో ఆగ్రహానికి గురైన ఆయన కార్యకర్తలపై రాయి విసిరారు.

ఇదివరకు కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేసి, ఈ మంత్రి వార్తలకెక్కారు. ‘కేంద్రప్రభుత్వం పాలపై కూడా జీఎస్టీ విధించింది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈ జీఎస్టీ వల్లే పాల ధర పెరిగింది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని