Updated : 23 Dec 2021 19:44 IST

Tamilnadu: తమిళనాట 33ఒమిక్రాన్‌ కేసులు...చెన్నైలో 26

చెన్నై: తమిళనాట కొత్తగా 33మందికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మాసుబ్రమణియన్‌ వెల్లడించారు.రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్‌ కేసు ఈనెల 15న నైజీరియా నుంచి వచ్చిన 47ఏళ్ల వ్యక్తికి నిర్ధారించారు.ఈనేపథ్యంలో విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన వారికి, వారితో సన్నిహితంగా ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి శాంపిళ్లను బెంగళూరులోని జీనోమిక్‌ సీక్వెన్సీ ల్యాబ్‌కు పంపి పరీక్షించగా 33మందికి ఒమిక్రాన్‌  సోకినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. ఇప్పటికే ఒకరికి ఒమిక్రాన్‌ సోకగా తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34కి చేరినట్లు పేర్కొన్నారు.మరో 24మందికి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన 34 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చెన్నైలో అత్యధికంగా 26మందికి, మదురైలో నలుగురికి, తిరువణ్ణామలైలో ఇద్దరికి, సేలంలో ఒకరికి ఒమిక్రాన్‌ సోకినట్లు తెలిపారు. తాజా ఒమిక్రాన్‌ కేసుల నమోదుతో జాతీయ స్థాయిలో తమిళనాడు మూడో స్థానంలో ఉందని తెలిపారు.ఇప్పటి వరకు 4,275మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. 34మందికి ఎటువంటి తీవ్ర లక్షణాలు లేవని, కొందరికి తల తిరగడం, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. తమిళనాట ఒక్కసారిగా 33మందికి ఒమిక్రాన్‌ నిర్ధారించడంతో తమిళనాడులోనూ, ముఖ్యంగా చెన్నైలో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇప్పటికే నూతన సంవత్సరం సందర్భంగా అధికంగా ప్రజలు గుమిగూడే అవకాశం ఉండటంతో 31, 1 న బీచ్‌ల్లో సందర్శకులను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

విమానాశ్రయాల్లో నిఘా కఠినతరం...

రాష్ట్రంలో 34మందికి ఒమిక్రాన్‌ నిర్ధారించిన నేపథ్యంలో చెన్నై విమానాశ్రయంలో నిఘాను కఠినతరం చేశారు. ఇప్పటికే అధికంగా ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూసిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు తప్పనిసరి చేశారు. ప్రయాణికుల పూర్తి వ్యక్తిగత వివరాలు, ఇంతకు ముందు వారు ఎక్కడెక్కడ ప్రయాణించారు వంటి వివరాలను  సేకరించి తదనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులందరికీ తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా నెగెటివ్‌ వచ్చినా కూడా వారిని నిరంతర పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.విమానాశ్రయంలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వులు జారీ చేశారు.చెన్నై విమానాశ్రయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు, చెన్నై కార్పొరేషన్‌ అధికారులు, చెంగల్‌పట్టు జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది తీవ్ర నిఘా ఉంచి ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని