విద్యార్థినితో పెళ్లి కోసం.. పురుషుడిగా మారిన టీచర్
స్కూల్లో విద్యార్థినితో ప్రేమలో పడిందో ఉపాధ్యాయురాలు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఏకంగా లింగమార్పిడి చేయించుకుంది. మగాడిగా మారి ఆమెను వివాహం చేసుకుంది.
భరత్‌పుర్: రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌కు చెందిన మీరా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేసేవారు. అదే పాఠశాలలో చదువుతున్న కల్పన అనే అమ్మాయితో మీరాకు స్నేహం ఏర్పడింది. అది కాస్తా క్రమక్రమంగా ప్రేమగా మారింది. దీంతో కల్పనను వివాహం చేసుకునేందుకు మీరా లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆరవ్ కుంతల్‌గా పేరు మార్చుకున్నారు. వీరి ప్రేమ గురించి ఇరువురి ఇంట్లో చెప్పి ఒప్పించారు. పెద్దల అంగీకారంతో రెండు రోజుల క్రితం వివాహబంధంతో ఒక్కటయ్యారు.
‘‘ప్రేమలో ఏదైనా కరెక్టే. అందుకే నేను లింగమార్పిడి చేయించుకున్నాను. స్కూల్లో ప్లే గ్రౌండ్‌లో కల్పనతో నా పరిచయం ప్రేమగా మారింది. నాకు నలుగురు అక్కలు. నేను అమ్మాయిగా పుట్టినప్పటికీ.. అబ్బాయిగా ఉండాలనే అనిపించేది. చిన్నప్పటి నుంచి అలాగే ప్రవర్తించా. అందుకే లింగమార్పిడి చేయించుకోవాలనుకున్నా. ఇదే విషయాన్ని కల్పనతో చెప్పా. 2019 డిసెంబరులో నా తొలి శస్త్రచికిత్స జరిగింది. ఈ ప్రక్రియలో నేను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా. చివరకు నా ప్రయత్నం ఫలించింది. మా ఇంట్లో వాళ్లు కూడా అంగీకరించడంతో మేమిద్దం ఒక్కటయ్యాం’’ అని మీరా అలియాస్ ఆరవ్ మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ.. ‘‘తనంటే నాకు చాలా ఇష్టం. ఈ సర్జరీ చేయించుకోకపోయినా నేను తనని పెళ్లి చేసుకునేదాన్ని’’ అని తెలిపింది. రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారిణి అయిన కల్పన.. వచ్చే ఏడాది జనవరిలో అంతర్జాతీయ కబడ్డీ టోర్నమెంట్ కోసం దుబాయి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె