Teenager dies: స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి బయటకురాగానే కుప్పకూలి.. బాలుడి మృతి

Teenager dies: స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకొట్టి బయటకు వచ్చిన మరుక్షణమే ఓ 15 ఏళ్ల బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

Published : 22 Jun 2024 13:31 IST

మేరఠ్‌: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలుడు ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయాడు. స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే కుప్పకూలి చనిపోయాడు.

మేరఠ్‌ (Meerut)లోని సివాల్ఖస్‌ ప్రాంతానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలుడు శుక్రవారం మధ్యాహ్నం స్కూల్‌ పూర్తవగానే తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌ (Swimming Pool)కు వెళ్లాడు. అక్కడ కొంతసేపు ఈత కొట్టి పూల్‌ నుంచి బయటకు వచ్చాడు. రెండడుగులు వేశాడో, లేదో ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మహిళపై దాడి చేస్తుంటే.. వీడియోలు తీస్తూ చోద్యం..

ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి మృతిపై కుటుంబసభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయనప్పటికీ.. పోలీసులు సుమోటోగా స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఘటన అనంతరం స్విమ్మింగ్‌ పూల్‌ మేనేజర్‌ పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని