రియాల్టీషో విజేతను అంతరిక్షంలోకి పంపుతారట!

టీవీల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోలకు మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇటీవల కాలంలో ఆయా షోల్లో పాల్గొనే పోటీదారులను ఓట్లు వేసి గెలిపించే బాధ్యత టీవీ చూసే ప్రేక్షకులపైనే ఉంటోంది. ప్రేక్షకులు మెచ్చిన విజేతలకు రియాల్టీ షో నిర్వాహకులు లక్షల్లో

Updated : 18 Aug 2022 11:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీవీల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోలకు మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇటీవల కాలంలో ఆయా షోల్లో పాల్గొనే పోటీదారులను ఓట్లు వేసి గెలిపించే బాధ్యత టీవీ చూసే ప్రేక్షకులపైనే ఉంటోంది. అలా ప్రేక్షకులు మెచ్చిన విజేతలకు రియాల్టీ షో నిర్వాహకులు రూ.లక్షలు.. కోట్లలో నగదు, కార్లు, బైకులు బహుమతులుగా ఇవ్వడం చూశాం. కానీ, ఓ ప్రొడక్షన్‌ కంపెనీ ప్రారంభించనున్న రియాల్టీ షోలో విజేతకు ఏకంగా అంతరిక్ష యాత్రను బహుమతిగా ఇవ్వనున్నారట. 

స్పేస్‌ హీరో ఇన్‌కార్పొరేషన్‌ అనే అమెరికాకు చెందిన ప్రొడక్షన్‌ కంపెనీ త్వరలో ‘స్పేస్‌ హీరో’ పేరుతో ఓ రియాల్టీ షోను ప్రారంభించనుందట. ఈ షో ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పోటీలు పెడతారనే విషయాలు వెల్లడించలేదు. కానీ, 2023లో ఈ షో విజేతను అంతరిక్ష కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షయాత్రపై ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఒక్కచోటకు చేర్చి అంతరిక్ష కేంద్రంలో ఉండగలరా లేదా అని శారీరక, మానసిక పరీక్షలు నిర్వహిస్తారట. వారి ప్రదర్శన, ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా విజేతగా నిలిచిన వారిని పది రోజుల అంతరిక్ష యాత్రకు పంపనున్నారు. యాత్రలో భాగంగా విజేత రాకెట్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. పది రోజులు అక్కడే బస చేసి తిరిగి భూమి మీదకు వస్తారు. ఇందుకోసం ప్రైవేటు స్పేస్‌ మిషన్‌ సంస్థ ‘యాక్సివోమ్‌ స్పేస్‌’తో స్పేస్‌ హీరో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో నాసాతో సంప్రదింపులు జరిపి.. ఈ రియాల్టీ షో పూర్తి వివరాలు వెల్లడిస్తారట. ఈ మేరకు స్పేస్‌ హీరో సంస్థ ప్రకటన విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని