Updated : 20 Dec 2021 16:59 IST

ICMR: ఒమిక్రాన్‌ను పసిగట్టే సరికొత్త కిట్‌.. రూపొందించిన ఐసీఎంఆర్‌

దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్​ను పసిగట్టేందుకు.. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్​ఆర్) సరికొత్త కిట్​ను రూపొందించింది. ఈ కిట్​ను వాణిజ్యపరంగా వినియోగించేందుకు, కిట్లను సొంతంగా అభివృద్ధి చేసి, కావాల్సిన సాంకేతికతను బదిలీ చేసేందుకు ఇన్​ విట్రో డయొగ్నాస్టిక్స్​ (ఐవీడీ) కిట్​ తయారీదారుల నుంచి ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​ (ఈఓఐ) కోసం ఆహ్వానించింది. ఒమిక్రాన్​ను గుర్తించేందుకు కావాల్సిన సాంకేతికత (రియల్​ టైమ్​ ఆర్​టీపీసీఆర్​ అస్సే), కిట్​ను డిబ్రుగఢ్​లోని ఐసీఎమ్​ఆర్​ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. దీనిపై మేథో సంపత్తి హక్కులు, వాణిజ్యపరమైన హక్కులు తమకే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. ఒప్పందం కుదుర్చున్న వారికి కిట్​ను తయారు చేసి, అమ్ముకునే అధికారాన్ని ఇస్తామని వెల్లడించింది.

ప్రస్తుతం ఒమిక్రాన్​ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కిట్​లు లేవు. అనుమానిత రోగుల నుంచి నమూనాలను సేకరించి జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు తేలేందుకు ఆలస్యమవుతోంది. ఈ తరుణంలో ఐసీఎమ్​ఆర్​ తాజా ప్రకటన ఊరటనిచ్చే విషయం. కిట్​ను ఉపయోగించి ఒమిక్రాన్​ను వేగంగా గుర్తించినట్లయితే.. రోగికి మెరుగైన చికిత్స అందిస్తూనే, వైరస్​ కట్టడికి చర్యలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని