Cow: జాతీయ జంతువుగా గోవు : అలహాబాద్‌ హైకోర్టు సూచన

గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ, దానికి హాని తలపెట్టేవారిని కఠినంగా శిక్షించేలా పార్లమెంటు ఓ చట్టం చేయాలని అలహాబాద్‌ హైకోర్టు బుధవారం పేర్కొంది.

Updated : 02 Sep 2021 10:01 IST

అలహాబాద్‌: గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ, దానికి హాని తలపెట్టేవారిని కఠినంగా శిక్షించేలా పార్లమెంటు ఓ చట్టం చేయాలని అలహాబాద్‌ హైకోర్టు బుధవారం పేర్కొంది. భారతీయ సంస్కృతిలో ఆవుకు విశిష్ట స్థానం ఉందన్న కోర్టు, ప్రాథమిక హక్కు అనేది గోమాంసం తినేవారికే ప్రత్యేకం కాదని, గోవును పూజించేవారికీ, దాని మీద ఆర్థికంగా ఆధారపడినవారికీ ఉంటుందని వ్యాఖ్యానించింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసి చంపిన  జావేద్‌ అనే వ్యక్తికి బెయిల్‌ నిరాకరిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ శేఖర్‌ కుమార్‌ యాదవ్‌తో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ‘‘చంపే హక్కు కన్నా జీవించే హక్కు ఉన్నతమైంది. గోమాంసం తినే హక్కు ప్రాథమిక హక్కు కాదు’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుడిని బెయిల్‌ మీద విడుదల చేస్తే మళ్లీ అదే నేరానికి పాల్పడతాడని అన్నారు. భారత సంస్కృతిలో గోవు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్నది హిందువులే కాదని, ముస్లిం పాలకులు కూడా ఉన్నారని చెప్పారు. ఓ దేశ సంస్కృతి, విశ్వాసాలు దెబ్బతింటే దేశం బలహీనంగా మారుతుందని వ్యాఖ్యానించారు. అక్రమ గోశాలలు నడిపేవారిపైనా చర్యలు తీసుకునేలా చట్టాలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని