Trump: ట్విటర్‌ ఖాతా పునరుద్ధరణకు కోర్టును ఆశ్రయించిన ట్రంప్‌

తన ట్విటర్‌ ఖాతాను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోర్టును ఆశ్రయించారు.

Updated : 04 Oct 2021 07:10 IST

న్యూయార్క్‌: తన ట్విటర్‌ ఖాతాను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన తరఫు న్యాయవాదులు ఫ్లోరిడాలోని ఓ జిల్లా కోర్టులో శుక్రవారం వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరిలో అమెరికా కేపిటల్‌ వద్ద చోటుచేసుకున్న హింస తర్వాత ట్రంప్‌ ఖాతాను ట్విటర్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ హింసను ప్రేరేపించే అవకాశం ఉందన్న ఆందోళనలతో ఈ చర్యను చేపడుతున్నట్లు అప్పట్లో ట్విటర్‌ తెలిపింది. ఇలాంటి కారణాలతోనే ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ కూడా ఆయన ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈమేరకు జులైలోనే వాటిపై ట్రంప్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. సామాచ్కీజిజిక మాధ్యమ ఖాతాల శాశ్వత పునరుద్ధరణ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్‌ తాజాగా పిటిషన్‌ వేశారు. కాగా దీనిపై వ్యాఖ్యానించేందుకు ట్విటర్‌ నిరాకరించింది. ట్రంప్‌ ఖాతా నిలిపివేసే నాటికి ఆయనకు దాదాపు 8.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని