Taj Mahal: అప్పట్లో షాజహాన్‌.. ఇప్పుడు ఆనంద్‌ ప్రకాశ్‌

సారీ డియర్‌! షాజహాన్‌లా నీకోసం తాజ్‌మహల్‌ కట్టించలేను. అయినా అంత గొప్ప ప్రేమ నాలో ఉంది. ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి సరదా సంభాషణలు

Updated : 23 Nov 2021 15:08 IST

భార్యకు తాజ్‌మహల్‌ బహుమతిగా ఇచ్చిన మధ్యప్రదేశ్‌ వ్యక్తి

సారీ డియర్‌! షాజహాన్‌లా నీకోసం తాజ్‌మహల్‌ కట్టించలేను. అయినా అంత గొప్ప ప్రేమ నాలో ఉంది. ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి సరదా సంభాషణలు వినిపిస్తుంటాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌కి చెందిన ఆనంద్‌ ప్రకాశ్‌ మాత్రం తన సతీమణి కోసం ఏకంగా తాజ్‌మహల్‌ లాంటి ఇంటిని కట్టించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘‘కొత్తగా ఇంటిని నిర్మించాలని భావించినప్పుడు తాజ్‌మహల్‌లా ఎందుకు కట్టకూడదని అనుకున్నా. అదే నా భార్యకు మంచి బహుమతి అనిపించింది. మా తాజ్‌మహల్‌లో మొత్తం ఏడు గదులు ఉన్నాయి. పెద్ద హాల్‌, వంటగదితోపాటు నాలుగు పడక గదులు ఉన్నాయి. బయట నుంచి కనిపించే డిజైన్‌ అంతా నిజమైన తాజ్‌మహల్‌ స్ఫూర్తిగా తీసుకున్నాం. ఈ ఇంటిని నిర్మించేందుకు మూడేళ్లు పట్టింది’’ అని వెల్లడించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని