Published : 10 Nov 2021 19:30 IST

Jacinda Ardern: కూతుర్ని నిద్రపుచ్చడం కోసం సమావేశం మానుకున్న ప్రధాని..!

వెల్లింగ్టన్‌: జెసిండా ఆర్డెర్న్‌.. న్యూజిలాండ్ దేశానికి ప్రధాని. అయినా సరే ఆ దర్పమేమీ కనిపించకుండా దాన్నొక ఉద్యోగంలానే ఫీల్ అవుతారు. ఒకవైపు దేశంలో నెలకొన్న క్లిష్టసమస్యలను ఎదుర్కొంటూనే, తన మూడేళ్ల కుమార్తె అడిగే ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం ఇస్తుంటారు. తాజాగా ఫేస్‌బుక్ లైవ్‌ స్ట్రీమింగ్‌లో కొవిడ్‌-19 ఆంక్షల్ని సవరించడం గురించి మాట్లాడుతుండగా.. తన కూతురు ఇంకా ఎంతసేపు మమ్మీ అంటూ జెసిండాను పిలవడం వినిపిస్తుంది. అందుకు ఆమె ఏమాత్రం హడావుడిగా పడకుండా కూల్ సమాధానం ఇవ్వడం ఆకట్టుకుంటోంది. 

జెసిండా ఫేస్‌బుక్ లైవ్‌లో అధికారులతో మాట్లాడుతుండగా ఆమె మూడేళ్ల కుమార్తె నెవె మమ్మీ అని పిలవడం వినిపిస్తుంది. అప్పుడు జెసిండా ఇది నిద్రపోయే టైం తల్లీ అని సర్దిచెప్పగా.. అటునుంచి ‘నో’ అని బదులొచ్చింది. ‘ఇప్పుడు నిద్రపోవాలమ్మా. వెళ్లి పడుకో. నేను ఒక నిమిషంలో వచ్చేస్తా’ అంటూ ప్రధాని కూతురికి చెప్పారు. ఆ వెంటనే ఇటు తిరిగి సమావేశంలో పాల్గొన్న ప్రతిఒక్కరిని క్షమాపణ కోరారు. కానీ నెవె మాత్రం నిద్రపోవడం లేదు. ఇంకా ఎంతసేపంటూ వాళ్లమ్మను పిలుస్తూనే ఉంది. తాను వెళ్లకపోతే నెవె ఆగేలా కనిపించకపోయేసరికి.. జెసిండా సమావేశం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇలా నెవె ప్రజల దృష్టిని ఆకర్షించడం ఇదే మొదటిసారేం కాదు. 

2018లో న్యూజిలాండ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే జెసిండా నెవెకు జన్మనిచ్చింది. అప్పుడు ఆ విషయం అందరిని ఆశ్చర్యపర్చింది. ఆ పదవిలో ఉండి ఒక బిడ్డకు జన్మనిచ్చిన రెండో ప్రధాని ఈమె. మొదటి వ్యక్తి పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో. ఇదిలా ఉండగా.. నెవె పుట్టిన తొలినాళ్లలోనే జెసిండా న్యూయార్క్‌లో ఐరాస సమావేశానికి హాజరు కావాల్సి వచ్చింది. ఆమె ఆ సమావేశంలో పాల్గొనగా.. తండ్రే పాప ఆలనాపాలనా చూసుకున్నారు. అప్పట్లో ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి.  


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్