- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Covovax in India: 2 నుంచి 17 ఏళ్ల పిల్లలపై క్లినికల్ ట్రయల్స్..!
నియామక ప్రక్రియ ప్రారంభించిన సీరం ఇన్స్టిట్యూట్
దిల్లీ: దేశంలో చిన్నారుల కోసం కరోనా టీకా తెచ్చేందుకు మరో సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అమెరికాకు చెందిన నొవావాక్స్ సంస్థ చిన్నారుల కోసం తయారు చేసిన టీకా (Covovax)ను భారత్‌లో రెండు, మూడో దశల ప్రయోగాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం 2 నుంచి 17ఏళ్ల మధ్య వయసు చిన్నారులను నియమించుకునే ప్రక్రియను ఆదివారం ప్రారంభించింది. దిల్లీలోని హమ్దార్ద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో వీటిని నిర్వహిస్తున్నారు.
చిన్నారులపై ప్రయోగాల్లో భాగంగా మొత్తం 920మంది పిల్లలపై వీటిని ప్రయోగించనున్నారు. ఇందులో 460 మంది 2 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లలు కాగా మరో 460 మందిని 12 నుంచి 17 ఏళ్ల వయసున్న చిన్నారులను పరిగణలోకి తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కొవావాక్స్ ప్రయోగాలను భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఇక 12 నుంచి 18 ఏళ్ల పిల్లలు వినియోగించేలా భారత్‌కు చెందిన జైడస్ క్యాడిలా వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఈమధ్యే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
ఇక అమెరికాకు చెందిన నొవావాక్స్ రూపొందించిన కొవావాక్స్ టీకా పెద్దల్లో సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. వీటిని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూకే, అమెరికా దేశాల్లో 50వేల మంది పెద్దలు, 2,248 మంది చిన్నారులపై ప్రయోగాలు నిర్వహించారు. కరోనా వైరస్‌ను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్ 90శాతం సమర్థత చూపించినట్లు ఫలితాల్లో తేలింది. భారత్‌లోనూ 1400 మంది (18 ఏళ్ల పైబడిన వారి)పై అధ్యయనం జరుగుతోంది. ఇప్పటికే వీరందరికీ తొలి డోసు అందించగా ఎలాంటి దుష్ర్పభావాలు కనిపించలేదని తెలిసింది. ఇదే సమయంలో కొవొవాక్స్ టీకా మొదటి బ్యాచ్ ఉత్పత్తిని సీరం ఇన్స్టిట్యూట్ పుణె కేంద్రంలో ఈ మధ్యే ప్రారంభించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Imram Tahir : తాహిర్‌కు రొనాల్డో పూనాడు.. వికెట్ సంబరం ఎలా చేశాడో చూసేయండి..!
-
India News
Bilkis Bano: ఆ దోషులను ఎందుకు విడుదల చేశారో అర్థంకావడం లేదు
-
Movies News
Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
-
General News
Andhra News: నిబంధనల ప్రకారమే రెవెన్యూ ఉద్యోగులు దేవాదాయశాఖలోకి: మంత్రి సత్యనారాయణ
-
Politics News
Nara lokesh: జగన్‌వి.. పదో తరగతి పాస్.. డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు: నారా లోకేశ్
-
Sports News
Test Captain : భావి భారత టెస్టు కెప్టెన్‌గా అతడికే ఎక్కువ అవకాశం: టీమ్ఇండియా మాజీ ఆటగాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- RRR: ఆస్కార్‌కు ‘ఆర్ఆర్ఆర్’.. నామినేట్ అయ్యే ఛాన్స్ ఎంతంటే?
- Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
- Hardik : హార్దిక్ ఫుల్ స్వింగ్‌లో ఉంటే భారత్‌ను తట్టుకోలేం: జింబాబ్వే బ్యాటింగ్ కోచ్
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- Imram Tahir : తాహిర్‌కు రొనాల్డో పూనాడు.. వికెట్ సంబరం ఎలా చేశాడో చూసేయండి..!