Sameer Wankhede: నవాబ్ మాలిక్.. మీపై చట్టపరమైన చర్యలు తప్పవు..!
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలపై స్పందించిన సమీర్ వాంఖడే.. మంత్రి ఆరోపణలను తిప్పికొట్టారు. ఓ మహిళ పేరును బహిరంగంగా ప్రస్తావిస్తూ ఆరోపణలు చేసినందుకు గానూ చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
మంత్రి ఆరోపణలను తిప్పికొట్టిన సమీర్ వాంఖడే
ముంబయి: ఎన్సీబీ ముంబయి జోనల్ అధికారి సమీర్ వాంఖడే మరదలికి డ్రగ్స్ వ్యాపారాలతో సంబంధముందంటూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సమీర్ వాంఖడే.. మంత్రి ఆరోపణలను తిప్పికొట్టారు. ఓ మహిళ పేరును బహిరంగంగా ప్రస్తావిస్తూ ఆరోపణలు చేసినందుకు గానూ చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
‘మిత్రమా.. ఓ మహిళ పేరును ప్రచారం చేసి మంచి పని చేశారు. మీడియా ప్రకటన విడుదల చేసినప్పుడు కూడా మేం మహిళ గౌరవాన్ని కాపాడడంలో భాగంగా వారి పేర్లను ప్రస్తావించం. అటువంటిది ఇద్దరు పిల్లలు, కుటుంబమున్న ఓ మహిళ పేరును బహిరంగంగా ప్రకటించడం సరైందేనా..? నవాబ్ మాలిక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నాం’ అని ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే మరదలికి డ్రగ్స్ వ్యాపారాలతో సంబంధముందన్న వాటిపై సమాధానం చెప్పాలంటూ నవాబ్ మాలిక్ చేసిన డిమాండ్‌కు ఎన్సీబీ అధికారి ఈ విధంగా స్పందించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ చట్టం కింద 2008లో నమోదైన కేసులో వాంఖడే సతీమణి సోదరి పేరు కూడా ఉంది. ఈ కేసును ఆధారంగా చేసుకుని నవాబ్ మాలిక్.. సమీర్‌పై ఆరోపణలు చేశారు. ‘‘సమీర్ దావూద్ వాంఖడే.. మీ మరదలు డ్రగ్స్ వ్యాపారం చేశారా? దీనికి మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆమె కేసు పుణె కోర్టులో పెండింగ్‌లో ఉంది’’ అని మాలిక్ ట్వీట్ చేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన సమీర్ వాంఖడే 2008లో తాను ఇంకా సర్వీసులోకే రాలేదన్నారు. అంతేగాక, క్రాంతి రేడ్కర్‌ను తాను 2017లో వివాహం చేసుకున్నానని.. అందువల్ల మంత్రి ఆరోపిస్తున్న కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. నవాబ్ మాలిక్‌పై వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ మత విశ్వాసాలను అవమానిస్తూ మాలిక్ ఆరోపణలు చేస్తున్నారని, దీని వల్ల తమ కుటుంబ గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లిందని ధ్యాన్‌దేవ్ పేర్కొన్నారు. ఇలా మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల్లో తన కుమారుడితోపాటు తమ కుటుంబ పరువుకు నష్టం కలిగించినందుకు గానూ రూ.1.25 కోట్ల పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వీటితోపాటు నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలను కూడా వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని ధ్యాన్‌దేవ్ వాంఖడే ఆ దావాలో పేర్కొన్నారు. ఈ కేసు విచారించిన బాంబే హైకోర్టు.. దీనిపై మంత్రి నవాబ్ మాలిక్ నవంబర్ 9లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు