Updated : 21 Dec 2021 15:00 IST

Smriti Irani: ఒక్క దెబ్బతో నా జ్ఞాననేత్రం తెరుచుకుంది.. నెట్టింట్లో కేంద్రమంత్రి పోస్టు!

దిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నెట్టింట్లో సరదా పోస్టులు పెడుతుంటారు. చమత్కారంగా స్పందిస్తూనే.. సందేశం ఇస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాలో ఆమె ఓ పోస్టును షేర్‌ చేశారు. తమ చిన్నప్పుడు పిల్లలు అతి గారాలు పోకుండా క్రమశిక్షణతో ఉండేలా తల్లిదండ్రులు ఎలా సరిదిద్దేవారో వివరించారు.

‘నా చిన్నతనంలో మా తల్లిదండ్రులు నన్ను సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లలేదు. మా అమ్మ ఒక్క దెబ్బతో నన్ను సరిచేసింది. నా జ్ఞాననేత్రం తెరిపించింది. నా పనులు, ఆలోచనలను అన్నింటినీ మార్చివేసింది’ అని అర్థం వచ్చేలా ఉన్న పోస్టును ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అలాగే ఒక దెబ్బతో తనలాగే కుదురుకున్న వాళ్లెవరో చెయ్యి ఎత్తాలంటూ నెటిజన్లను అడిగారు. ‘అమ్మా.. ఐ లవ్యూ’ అంటూ తన తల్లిపై ప్రేమను కురిపించారు.

ఈ పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ‘మా అమ్మ ఇప్పటికీ ఇలా చేస్తుంది’, ‘అలా నాకు చాలా సార్లు జరిగింది’ అంటూ పలువురు కామెంట్ చేశారు. అందుకే ఇప్పటివాళ్లతో పోల్చుకుంటే.. మనప్పటి పిల్లలకు మర్యాద, క్రమశిక్షణ ఎక్కువగా తెలుసని ఓ నెటిజన్ అనగా.. స్మృతి ఏకీభవించారు. బాటా చెప్పులతో నా తిక్క కుదిరిందని ఒకరు అనగా.. తనక్కూడా ఆ అనుభవం ఉన్నట్లు మంత్రి అన్నారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts