
COVID: బెంగళూరులో కొవిడ్ కలకలం.. 12మంది నర్సింగ్ విద్యార్థులకు పాజిటివ్
11మంది రెండు డోసులూ తీసుకున్నవారే..
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ మళ్లీ బుసలుకొడుతోంది. ధార్వాడ్‌లోని ఎస్డీఎం వైద్య కళాశాలలో ఇప్పటివరకు 182 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్ సోకగా.. తాజాగా బెంగళూరులోని ఓ నర్సింగ్ కళాశాలలో ఈ మహమ్మారి కలకలం రేపింది. మరాసూర్లోని స్ఫూర్తి నర్సింగ్ కళాశాలలో 12మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 11మంది టీకా రెండు మోతాదులూ తీసుకున్నవారే కాగా.. మరో విద్యార్థినికి జూన్‌లో కొవిడ్ రావడంతో ఆమె వేయించుకోకపోవడం గమనార్హం. అయితే, వీరిలో తొమ్మిది మందిలో కరోనా లక్షణాలు కనిపించగా.. మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు లేవు. కొవిడ్ బారిన పడిన విద్యార్థినులంతా బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నవారే.
మరోవైపు, తమ కళాశాలలో ఎప్పటికప్పుడు విద్యార్థులు, సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కళాశాల యాజమాన్యం తెలిపింది. గత రెండు నెలలుగా నిరంతరం క్యాంపస్‌లో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ఏడుసార్లు ఈ పరీక్షలు చేయించినట్టు కళాశాల ప్రిన్సిపల్ ఎం.కోకిల వివరించారు. కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామన్నారు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.