127వ ఏట కన్నుమూసిన వృద్ధుడు.. అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా రికార్డుల్లోకి!

ప్రపంచంలోనే అత్యధికకాలం జీవించిన వ్యక్తిగా ఆఫ్రికాలోని ఎరిత్రియాకు చెందిన నటాబే తిన్స్యూ చరిత్ర సృష్టించబోతున్నారు. కాకపోతే, చనిపోయిన తర్వాత! ఇప్పటివరకూ ఈ రికార్డు జపాన్‌కు

Updated : 02 Oct 2021 07:43 IST

ప్రపంచంలోనే అత్యధికకాలం జీవించిన వ్యక్తిగా ఆఫ్రికాలోని ఎరిత్రియాకు చెందిన నటాబే తిన్స్యూ చరిత్ర సృష్టించబోతున్నారు. కాకపోతే, చనిపోయిన తర్వాత! ఇప్పటివరకూ ఈ రికార్డు జపాన్‌కు చెందిన జిరోమోన్‌ కిమురా (116) పేరున ఉంది. అయితే, నటాబే 127 ఏళ్ల వయసులో గత సోమవారం కాలం చేశారు. ఆయన వయసుకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తన తాత 1894లో జన్మించాడంటూ నటాబే మనవడు జీర్‌ అధికారిక ధ్రువపత్రాన్ని కూడా అందించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను గిన్నిస్‌ నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. పశువుల కాపరిగా పనిచేసిన నటాబే 1934లో వివాహం చేసుకున్నారు. ఆయన భార్య కూడా ఎక్కువ కాలమే జీవించింది. 99 ఏళ్ల వయసులో ఆమె 2019లో మృతిచెందింది.

- అస్మారా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని