Afghanistan: తాలిబన్ల చెరలో భారతీయులు..?

అఫ్గానిస్థాన్‌లోని కాబుల్ విమానాశ్రయ సమీపం నుంచి 150 మంది పౌరులను తాలిబన్లు అపహరించినట్లు సమాచారం. వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ వెంటనే అప్రమత్తమైంది. మరోపక్క ఈ వార్తలను తాలిబన్‌ ప్రతినిధి ఖండించారు.   

Updated : 21 Aug 2021 14:25 IST

అప్రమత్తమైన విదేశాంగ శాఖ

కాబుల్‌: అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. కాబుల్ విమానాశ్రయ సమీపం నుంచి 150 మంది పౌరులను తాలిబన్లు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. అఫ్గాన్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ వెంటనే అప్రమత్తమైంది. మరోపక్క ఈ వార్తలను తాలిబన్‌ ప్రతినిధి ఖండించారు.

భారత వైమానిక విమానం సీ-130 కాబుల్‌ నుంచి కొద్ది గంటల క్రితం 85 మంది భారతీయుల్ని తరలించింది. ఆ విమానం తజకిస్థాన్‌లోని దుషన్‌బేలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అపహరణ గురించి వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

వారికి ఏ ప్రమాదం లేదు..

అపహరణకు గురైన భారతీయులకు తాలిబన్ల నుంచి ఏ ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. ప్రస్తుతం వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నట్లు చెప్పాయి. భారతీయ పౌరులందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని