CERT-In: భారత్‌లో 15వేల వెబ్సైట్లు హ్యాక్..!
దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నాటికే 6లక్షల సైబర్ సెక్యూరిటీ ఘటనలు చోటుచేసుకోగా వాటిలో 15వేల భారత వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: భారత్‌లో ప్రతిఏటా వేల సంఖ్యలో వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నాటికే 6లక్షల సైబర్ సెక్యూరిటీ ఘటనలు చోటుచేసుకోగా వాటిలో 15వేల భారత వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని పేర్కొంది. దేశంలో సైబర్ సెక్యూరిటీ సమస్యలను పర్యవేక్షించే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) ఇచ్చిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు సమర్పించింది. దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ హ్యాకింగ్ ఉదంతం పార్లమెంటును కుదిపేస్తున్న సమయంలో కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది.
దేశంలో పలు కీలక రంగాలైన పవర్ గ్రిడ్లను చైనాకు చెందిన హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చాయి. వీటిపై ఇప్పటికే కేంద్ర విద్యుత్‌శాఖ దర్యాప్తునకు ఆదేశించారు. ఇదే సమయంలో పలు కీలక వ్యవస్థలపైనా ఇతర దేశాల హ్యాకర్లు దాడులకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా అల్జీరియా, బ్రెజిల్, చైనా, కెనడా, జర్మనీ, పాకిస్థాన్, రష్యా, అమెరికా, సింగపూర్, ఉత్తర్ కొరియాతో పాటు ఇతర దేశాల కేంద్రంగా ఈ హ్యాకింగ్ దాడులు జరుగుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో పేర్కొన్నారు.
దేశంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 2018లో 2లక్షలు, 2019లో 3.94లక్షలు, 2020లో 11.5లక్షలు, 2021లో 6లక్షల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో 2018లో 17వేల వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురవ్వగా ఈ ఏడాది జూన్ నాటికే 15,651 వెబ్సైట్లు హ్యాకింగ్ బారినపడినట్లు CERT నివేదికను కేంద్రమంత్రి లోక్‌సభలో వెల్లడించారు. భారత సైబర్ స్పేస్‌పై ఇటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయని.. అలాంటి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నామని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి చెప్పారు.
ఇదిలాఉంటే, గతేడాది లద్దాఖ్ సరిహద్దులో ఘర్షణలు జరుగుతున్న సమయంలో, భారత్ విద్యుత్ గ్రిడ్లపై చైనా సైబర్ దాడులకు పాల్పడిందంటూ అమెరికా సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ సంచలన విషయాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. గత అక్టోబర్‌లో ముంబయిలో పవర్ గ్రిడ్ విఫలం వెనక చైనా హస్తం ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఇలా చైనాతో పాటు ఇతర దేశాలకు చెందిన హ్యాకర్లు భారత వెబ్సైట్లపై దాడికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కోర్టులో గురువారం ఆయన తన వాదనలు స్వయంగా వినిపించారు. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్‌ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్‌వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్‌లోని ధన్‌గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు