Diabetes: మధుమేహ బాధితుల్లో 20% మందికి దీర్ఘకాలిక సమస్యలు

ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని పీడిస్తున్న ‘తీపి రుగ్మత’... మధుమేహం! ఈ బాధితుల్లో 20 శాతానికి పైగా మందిని ఏదోక అనారోగ్య సమస్య

Updated : 25 Nov 2021 11:18 IST

కొద్దిపాటి జాగ్రత్తలతో ఆరోగ్యం పదిలం 
అధ్యయనకర్త సూచనలివీ...

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని పీడిస్తున్న ‘తీపి రుగ్మత’... మధుమేహం! ఈ బాధితుల్లో 20 శాతానికి పైగా మందిని ఏదోక అనారోగ్య సమస్య దీర్ఘకాలంగా వెంటాడుతున్నట్టు నిపుణులు పేర్కొన్నారు. గుండె, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థ, కళ్లకు సంబంధించిన కనీసం ఒక సమస్య వారిని బాధిస్తున్నట్టు వివరించారు. ఈ ముప్పును తప్పించుకునే, తగ్గించుకునే పలు సూచనలు కూడా చేశారు! ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ (ఐఐసీ) ఆధ్వర్యాన దేశ రాజధానిలో నిర్వహించిన ‘డైలాగ్స్‌ ఇన్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌’ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు తమ అధ్యయన వివరాలను పంచుకున్నారు. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, గురుతేగ్‌ బహదూర్‌ ఆసుపత్రి ఎండోక్రైనాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డా.ఎస్‌.వి.మధు ప్రత్యేకంగా ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.

మెట్రో నగరాల్లో సమస్య తీవ్రం

‘‘ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో 8.5 కోట్ల మంది భారతీయులే! దిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. బాధితుల్లో 20% పైగా మం దిని కనీసం ఒక దీర్ఘకాలిక సమస్య పీడిస్తోంది. ఈ ప్ర భావం రోగులు, వారి కుటుంబంపై తీవ్రంగా ఉంటోంది.
ముప్పు తప్పాలంటే..

మధుమేహ రోగులు తమ చక్కెర, కొవ్వు, రక్తపోటు స్థాయులను నిత్యం నియంత్రణలో ఉంచుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. సమతుల పోషకాహారం తీసుకోవాలి. శారీరకంగా చైతన్యవంతంగా ఉండాలి. కంటి నిండా నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. పొగాకు ఉత్పత్తులకు, మద్యానికి దూరంగా ఉండాలి. దంతధావనం పట్ల శ్రద్ధ వహించి, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా అనారోగ్యం చుట్టుముడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా తీవ్ర, దీర్ఘకాలిక అనారోగ్య ముప్పును ముందే పసిగట్టి, వీలైనంతగా దాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది’’ అని వైద్యులు సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని