Corona Virus: వారిలో 25 శాతం మందికి కొవిడ్‌

పూర్తిస్థాయిలో కొవిడ్‌-19 టీకా పొందినప్పటికీ ఆరోగ్య పరిరక్షణ సిబ్బందిలో 25 శాతం మందికి ఆ మహమ్మారి సోకినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సినేషన్‌

Updated : 01 Sep 2021 12:30 IST

టీకా పొందిన ఆరోగ్య పరిరక్షణ సిబ్బందిపై అధ్యయనం

దిల్లీ: పూర్తిస్థాయిలో కొవిడ్‌-19 టీకా పొందినప్పటికీ ఆరోగ్య పరిరక్షణ సిబ్బందిలో 25 శాతం మందికి ఆ మహమ్మారి సోకినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సినేషన్‌ పూర్తయినవారిలో కరోనాలోని డెల్టా వేరియంట్‌ వల్ల కలుగుతున్న ఇన్‌ఫెక్షన్‌కు ఇది దర్పణం పడుతోందని పరిశోధకులు తెలిపారు. దిల్లీలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ’ (ఐజీఐబీ), మ్యాక్స్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని జరిపాయి. ఈ నగరంలో డెల్టా వేరియంట్‌ విజృంభిస్తున్న సమయంలో.. టీకా పొందినప్పటికీ కొవిడ్‌ బారినపడినవారు (బ్రేక్‌థ్రూ ఇన్‌ఫెక్షన్లు) ఊహించినదాని కన్నా ఎక్కువగానే ఉన్నారని ఇందులో తేలింది. అయితే ఇలాంటివారిలో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని వెల్లడైంది. అందువల్ల టీకాలతో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను తగ్గించుకోవచ్చని మరోసారి రుజువైంది. ‘బ్రేక్‌ థ్రూ ఇన్‌ఫెక్షన్ల’లోని 25 శాతం కేసుల్లో వ్యాధి లక్షణాలు బయటకు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కులు చాలా కీలకమని చెప్పారు. కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు పొందిన 95 మంది ఆరోగ్య సిబ్బందిపై ఈ అధ్యయనం జరిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని