corona virus: ఆ కాలేజీలో 281మంది విద్యార్థులకు కరోనా!

కర్ణాటక వాణిజ్య నగరి ధార్వాడలోని ఎస్‌డీఎం వైద్య కళాశాల ప్రాంగణం కరోనాతో హడలిపోతోంది. ఈ కళాశాలలో కొత్తగా మరో 77మందికి వైరస్‌ సోకింది. దీంతో ఇప్పటివరకు....

Updated : 27 Nov 2021 16:47 IST

బెంగళూరు: కర్ణాటక వాణిజ్య నగరి ధార్వాడలోని ఎస్‌డీఎం వైద్య కళాశాల ప్రాంగణం కరోనాతో హడలిపోతోంది. ఈ కళాశాలలో కొత్తగా మరో 77మందికి వైరస్‌ సోకింది. దీంతో ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 281కి చేరింది. కేసులు పెరుగుతుండటంతో కళాశాలలో కొత్త అడ్మిషన్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కళాశాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల్ని మూసివేశారు. కొవిడ్ నెగెటివ్‌ వచ్చిన వారిని డిశ్చార్జి చేయనున్నారు. కొవిడ్‌ సోకినవారిలో అత్యధికులు టీకా రెండు డోసులూ తీసుకున్నవారే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ కాలేజీ క్యాంపస్‌లో ఇటీవల ఫ్రెషర్స్‌డే పార్టీ వేడుకలు రెండు మూడు రోజుల పాటు కొనసాగడంతో ఈ వైరస్‌ ప్రబలి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు, కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వారిలో 113 శాంపిల్స్‌ని బెంగళూరులోని జీనోమ్‌సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు తరలించారు. వీటి నివేదికలు డిసెంబర్‌ 1వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఆరోగ్యశాఖ కమిషనర్‌ డి.రణ్‌దీప్‌ వెల్లడించారు. 

ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చదువుతున్న విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో సిబ్బంది వారికి కొవిడ్‌ పరీక్షలు చేయించగా కొందరు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గురువారం కళాశాలలోని దాదాపు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 66 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.  ఆ తర్వాత మరికొందరు విద్యార్థులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు మొత్తంగా 281మందికి ఈ మహమ్మారి సోకినట్టు గుర్తించారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని