తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 46 మంది మృతి

తూర్పు ఆసియా దేశం తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాహ్సిఅంగ్‌ నగరంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్య ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ నగరంలో 13 అంతస్తుల భవనంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది.

Published : 14 Oct 2021 16:09 IST

చికిత్స పొందుతున్న 79 మంది.. పెరగనున్న మృతుల సంఖ్య

తైపీ: తూర్పు ఆసియా దేశం తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాహ్సిఅంగ్‌ నగరంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ నగరంలో 13 అంతస్తుల భవనంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది.

ఆ భవనం మొత్తం మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బందికి నాలుగు గంటల సమయం పట్టినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఘటనలో గాయపడిన 79 మందిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే అగ్ని ప్రమాదానికి ముందు పెద్ద పేలుడు వినిపించినట్లు స్థానికులు వెల్లడించారు. అలాగే కింది అంతస్తుల్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులు ఉండిపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని