Engineering seats: 5.62 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు హుష్‌

దేశంలో గత మూడేళ్లలో 5,62,886 ఇంజినీరింగ్‌ సీట్లు తగ్గిపోయాయి. కొన్ని కోర్సులకు డిమాండ్‌ తగ్గిపోవడం, మున్ముందు విద్యార్థులు వాటిల్లో చేరుతారన్న నమ్మకం లేకపోవడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈమేరకు సీట్లు తగ్గించుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ

Updated : 27 Jul 2021 08:28 IST

ఈనాడు, దిల్లీ: దేశంలో గత మూడేళ్లలో 5,62,886 ఇంజినీరింగ్‌ సీట్లు తగ్గిపోయాయి. కొన్ని కోర్సులకు డిమాండ్‌ తగ్గిపోవడం, మున్ముందు విద్యార్థులు వాటిల్లో చేరుతారన్న నమ్మకం లేకపోవడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈమేరకు సీట్లు తగ్గించుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం లోక్‌సభకు తెలిపారు. అత్యధిక సీట్లు ప్రైవేటు కాలేజీల్లోనే తగ్గిపోయాయి. ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని 2022 సంవత్సరం వరకు కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు ఇవ్వబోదని  మంత్రి స్పష్టంచేశారు. ఆకాంక్షిత జిల్లాల్లో ఏర్పాటు చేసే కాలేజీలకే అనుమతిస్తున్నట్లు తెలిపారు. అత్యధిక ఉద్యోగావకాశాలున్న వృత్తి విద్యా కోర్సుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇంజినీరింగ్‌, డిప్లొమా కోర్సులు ప్రారంభించడానికి ముందుకొస్తే వాటికే అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు