
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు.. మృతుల్లో ఇద్దరు పాక్ జాతీయులు
ఆరుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు కూడా ఉన్నట్లు తెలిపారు. అనంతనాగ్, కుల్గాం జిల్లాల్లో నిన్న సాయంత్రం భద్రతా బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఆ క్రమంలో సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.
‘రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో జైషే మహమ్మద్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందినవారిగా గుర్తించాం. మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు. ఇది మాకు పెద్ద విజయం’ అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ వెల్లడించారు. కుల్గాం ప్రాంతంలో మరో ఉగ్రవాది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్లలో పోలీసు సిబ్బంది ఒకరు గాయపడ్డారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.