Covid Second Wave: 645 మంది చిన్నారులు అనాథలయ్యారు 

రెండో దశలో కొవిడ్‌ మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. కన్నవారిని దూరం చేసి ఎంతోమంది చిన్నారులను అనాథలను చేసింది. సెకండ్‌ వేవ్‌ సమయంలో

Published : 22 Jul 2021 21:27 IST

దిల్లీ: రెండో దశలో కొవిడ్‌ మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. కన్నవారిని దూరం చేసి ఎంతోమంది చిన్నారులను అనాథలను చేసింది. సెకండ్‌ వేవ్‌ సమయంలో కొవిడ్‌తో 645 మంది పిల్లలు తమ తల్లిదండ్రులను  కోల్పోయినట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు. 

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే 28 మంది దేశవ్యాప్తంగా 645 మంది చిన్నారులు అమ్మానాన్నలను కోల్పోయారని స్మృతి ఇరానీ తెలిపారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 158 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 119, మహారాష్ట్రలో 83, మధ్యప్రదేశ్‌లో 73 మంది చిన్నారులు అనాథలైనట్లు పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా కన్నవారిని దూరం చేసుకున్న చిన్నారులకు ఆర్థికంగా అండగా ఉండాలని, వారు చదువు కొనసాగించేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరినట్లు ఆమె తెలిపారు. 

అంతేగాక, అలాంటి చిన్నారులను ఆదుకోవడం కోసం ప్రధాని మోదీ ఇటీవలే ఓ ‘పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ పేరుతో ప్రత్యేక పథకం ప్రకటించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఆ పథకం ద్వారా అనాథలైన చిన్నారులకు విద్య, ఆరోగ్య సేవలు కల్పించడంతో పాటు వారు 18ఏళ్లు వచ్చేసరికి రూ.10లక్షల నిధిని సమకూర్చనున్నట్లు  తెలిపారు. 18ఏళ్ల తర్వాత అందులో కొంత మొత్తాన్ని.. వారు ఉన్నత చదువులకు ఉపయోగించుకునేలా నెలనెలా స్టయిఫండ్‌ రూపంలో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మిగతా మొత్తాన్ని వారు 23ఏళ్లు వచ్చాక ఇస్తామని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని