Afghanistan: ఆ విమానంలో 823 మంది ప్రయాణం!

అమెరికా వైమానిక దళానికి చెందిన కార్గో విమానం సీ-17 గత ఆదివారం కాబుల్‌

Updated : 22 Aug 2021 15:54 IST

వాషింగ్టన్‌: అమెరికా వైమానిక దళానికి చెందిన కార్గో విమానం సీ-17 గత ఆదివారం కాబుల్‌ విమానాశ్రయం నుంచి కిక్కిరిసిన జనంతో ప్రయాణించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన సంగతి  తెలిసిందే. నిజానికి ఆ రోజు ఊహకు మించి, మొత్తం 823 మంది అఫ్గాన్‌ శరణార్థులు అందులో ప్రయాణించినట్టు ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌ వెల్లడించింది. తొలుత 640 మందినే లెక్కపెట్టామని, వారి ఒళ్లో కూర్చుని మరో 183 మంది చిన్నారులు ప్రయాణించారని తెలిపింది. సీ-17 ద్వారా ఒకే దఫా ఇంతమందిని తరలించడం ఇదే రికార్డు అని వివరించింది.

వ్యక్తిగత సూచనలు లేకుండా రావొద్దు

కాబుల్‌ విమానాశ్రయం వెలుపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నందున... అమెరికా ప్రభుత్వ ప్రతినిధుల నుంచి వ్యక్తిగత సూచనలు వచ్చేంతవరకూ ఎవరూ కాబుల్‌ విమానాశ్రయానికి తరలి రావద్దని అఫ్గాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం శనివారం హెచ్చరించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని