Corona Vaccine: మైనర్‌కు కరోనా టీకా.. పరిస్థితి ఆందోళనకరం

కరోనా టీకా తీసుకున్న పదహారేళ్ల బాలుడు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో జరిగింది. మైనర్లకు టీకా కార్యక్రమం ప్రారంభం కానప్పటికీ సదరు బాలుడికి టీకా ఎలా ఇచ్చారనే

Updated : 30 Aug 2021 06:40 IST

మొరెనా: కరోనా టీకా తీసుకున్న పదహారేళ్ల బాలుడు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో జరిగింది. మైనర్లకు టీకా కార్యక్రమం ప్రారంభం కానప్పటికీ సదరు బాలుడికి టీకా ఎలా ఇచ్చారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. అంబా తాలుకాలోని బాగ్‌కాపురకు చెందిన కమలేశ్‌ కుష్వాహా కుమారుడు పిల్లుకు ఓ కేంద్రంలో శనివారం టీకా వేశారు. ఆ తర్వాత అతనికి తల తిరగడం సహా నోటి నుంచి నురగ వచ్చిందని సమాచారం. దీంతో ఆంబాలోని వైద్యులు చికిత్స కోసం అతడిని గ్వాలియర్‌ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఈ ఘటనతో వ్యాక్సిన్‌ కేంద్రం వద్ద బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే పిల్లును గ్వాలియర్‌కు తీసుకెళ్లారా లేదా అని తెలుసుకుంటున్నట్లు జిల్లా ముఖ్య వైద్య, ఆరోగ్య అధికారి డా.ఎ.డి. శర్మ తెలిపారు. వివరాలు సేకరిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని