
Covid: కొవిడ్‌కు మధుమేహం, ఊబకాయ ఔషధాలు
ఐఐఎస్ఈఆర్ పరిశోధనలో వెల్లడి
దిల్లీ: మధుమేహం, ఊబకాయానికి వాడే ఔషధాలు కొవిడ్-19 చికిత్సలోనూ ఉపయోగపడతాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) పరిశోధకులు కనుగొన్నారు. కొవిడ్, వృద్ధాప్యం, మధుమేహం మధ్య జీవ అణువుల సంబంధాన్ని వీరు తమ పరిశోధనలో సమీక్షించారు. ‘‘మొక్కలనుంచి వచ్చే ఆహారంలో కనిపించే పాలీఫెనాల్స్..ఉదాహరణకు కర్క్మిన్ (పసుపులో కనిపించేవి), రెస్వరెట్రాల్ లాంటివి వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తాయి. వీటిలోనూ వైరస్‌ను నిరోధించే లక్షణాలు ఉంటాయి’’ అని ఐఐఎస్ఈఆర్ శాస్త్రవేత్త అమ్జాద్ హుస్సేన్ తెలిపారు. వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు వాడుతున్న రేపమైసిన్ ఔషధం, రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే మెట్‌ఫార్మిన్‌ను కూడా కొవిడ్ చికిత్సలో వాడొచ్చని హుస్సేన్ చెప్పారు. ఈ పరిశోధనను మాలిక్యులర్ అండ్ సెల్యూలార్ బయోకెమిస్ట్రీ జర్నల్ ప్రచురించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.