Smart Phone: స్మార్ట్‌ఫోన్‌ నుంచి మంటలు.. విమానం అత్యవసర ల్యాండింగ్‌

ఓ ప్రయాణికుడి స్మార్ట్‌ఫోన్‌లో మంటలు చెలరేగడం వల్ల అలస్కా ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.  

Updated : 26 Aug 2021 07:18 IST

వాషింగ్టన్‌: ఓ ప్రయాణికుడి స్మార్ట్‌ఫోన్‌లో మంటలు చెలరేగడం వల్ల అలస్కా ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.  అందులో 128 మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బందిని ఖాళీ చేయించి.. బస్సులో తరలించారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో కొంత మందికి స్వల్ప గాయాలు మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. అలస్కా751 విమానం.. 128 మంది ప్రయాణికులతో న్యూ ఓర్లీన్స్‌ నుంచి సీటెల్‌కు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి స్మార్ట్‌ఫోన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. మంటలు అదుపు చేసి, సీటెల్‌-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దించారు. ప్రయాణికులతో పాటు సిబ్బందిని సురక్షితంగా బస్సులో తరలించారు. అనంతరం ఘటనపై దర్యాప్తు జరిపిన సిబ్బంది.. ఆ స్మార్ట్‌ఫోన్‌ పూర్తిగా దగ్ధమైనట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని