Covid Vaccine: టీకాలకూ నకిలీ మకిలి.. గుర్తింపునకు కేంద్రం మార్గదర్శకాలు
దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో నకిలీ కొవిషీల్డ్ టీకాలను అక్రమార్కులు వ్యాప్తి చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. ఈ అంశంపై రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలో వినియోగంలో ఉన్న కొవిడ్ టీకాలు నిజమైనవా.. కావా.. అన్నది తేల్చేందుకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల తయారీదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వీటిని రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సిన్ తయారీదారులు ఉపయోగించే లేబుల్, రంగు, ఇతర అంశాలను అందులో ప్రస్తావించింది.
ఆగ్నేయాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో నకిలీ కొవిషీల్డ్ టీకాలు వ్యాప్తిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందిస్తూ రాష్ట్రాల ఆరోగ్యశాఖలకు లేఖలు రాసింది. ‘‘వినియోగానికి ముందు టీకాలను చాలా జాగ్రత్తగా ధ్రువీకరించాల్సిన అవసరం ఉంది. జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద పనిచేస్తున్న ప్రోగ్రామ్ మేనేజర్లు, సర్వీసు ప్రొవైడర్ల అవగాహన కోసం టీకా లేబుళ్లు, వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లకు సంబంధించిన అదనపు సమాచారాన్ని పంపుతున్నాం. వీటిని ఆ సిబ్బంది జాగ్రత్తగా పాటించి, నకిలీ టీకాలను గుర్తించాలి’’ అని సూచించింది.
* అసలైన కొవిషీల్డ్ వయల్‌పై దాని తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐఐ)కు సంబంధించిన లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. బ్రాండ్ పేరు, ట్రేడ్‌మార్కు దానిపై ఉంటాయి. టీకా వివరాలు, ‘రీకాంబినెంట్’ అని అన్‌బోల్డ్ అక్షరాల్లో ముద్రించారు. ‘సీజీఎస్ నాట్ ఫర్ సేల్’ అని కూడా ఉంటుంది. వయల్‌పై ముదురు ఆకుపచ్చ రంగులో అల్యూమినియం ఫ్లిప్-ఆఫ్ సీలును ఏర్పాటుచేశారు. ఎస్‌ఐఐ చిహ్నం ఏటవాలుగా ముద్రించి ఉంటుంది. అక్షరాలు ప్రత్యేక తెల్ల రంగులో ఉంటాయి.
* కొవాగ్జిన్ లేబుల్‌పై డీఎన్‌ఏ తరహా ఆకృతి ముద్రించి ఉంటుంది. అది అతినీల లోహిత కాంతిలోనే కనపడుతుంది. అలాగే లేబుల్‌పై మైక్రో టెక్స్ట్, కొవాగ్జిన్ పేరులోని ‘ఎక్స్’ పదంపై పచ్చ వర్ణం, కొవాగ్జిన్ పేరుపై హాలోగ్రాఫిక్ ప్రభావం వంటివి ఉన్నాయి.
* స్పుత్నిక్ టీకాను రష్యాలోని రెండు తయారీ సంస్థల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అందువల్ల వాటి లేబుళ్లు రెండు రకాలుగా ఉంటాయి. ఐదు యాంపిళ్లతో కూడిన పెట్టెపై ముందు, వెనుక భాగాల్లో ఇంగ్లిష్ లేబుళ్లు ఉంటాయి. మిగతా రెండు భాగాలతోపాటు యాంపిల్‌పై ఉండే ప్రధాన లేబుల్‌తోపాటు రష్యన్ భాష ముద్రించి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Viral-videos News
Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
-
Movies News
Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
-
General News
Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
-
Politics News
Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
-
India News
Anand Mahindra: ఆ కాఫీ మగ్ తెప్పించుకోబోతున్నాను..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- UN: ఐరాస ఉగ్ర ఆంక్షల విధానాలపై మండిపడ్డ భారత్..!
- IIT Madrasలో రికార్డుస్థాయి ప్లేస్మెంట్లు..ఓ విద్యార్థికి ₹2కోట్ల వార్షిక వేతనం!
- Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Thief: ‘నన్ను క్షమించు తల్లీ’.. దేవతను వేడుకొని మరీ హుండీ ఎత్తుకెళ్లిన దొంగ
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు