Afghanistan: అఫ్గాన్‌లోని గుడిని విడిచి రాను.. తేల్చిచెప్పిన ఓ హిందూ పురోహితుడు

ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడేందుకు అక్కడి పౌరులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కిక్కిరిసిపోయిన విమానాల్లో ప్రయాణించేందుకు ఎగబడుతున్నారు. కొందరు విమాన పైభాగాన ఎక్కి ప్రయాణించి..

Updated : 18 Aug 2021 06:57 IST

 

కాబుల్‌: ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడేందుకు అక్కడి పౌరులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కిక్కిరిసిపోయిన విమానాల్లో ప్రయాణించేందుకు ఎగబడుతున్నారు. కొందరు విమాన పైభాగాన ఎక్కి ప్రయాణించి.. ప్రాణాలు కోల్పోయారు. ఇలా.. ఏదో విధంగా దేశం దాటి వెళ్లాలని యత్నిస్తున్నారు. కానీ అఫ్గాన్‌లోని ఓ హిందూ పురోహితుడు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. అఫ్గాన్‌ వదిలి వెళ్లే అవకాశం వచ్చినా.. తిరస్కరించారు. పండిత్‌ రాజేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి కాబుల్‌లోని రతన్‌నాథ్‌ మందిరంలో పూజారిగా సేవలందిస్తున్నారు. వందల ఏళ్ల నుంచి తన పూర్వీకులు ఈ మందిరాన్ని సంరక్షిస్తూ వచ్చారని, అలాంటి గుడిని ఇప్పుడు విడిచిపెట్టలేనని అంటున్నారు. ఒకవేళ తాలిబన్లు తనను చంపేసినా.. దాన్ని సేవగా భావిస్తానని చెప్పారు. గుడికి వచ్చే చాలా మంది హిందువులు, భక్తులు తమతో పాటు వచ్చేయాలని కోరినట్లు రాజేశ్‌ తెలిపారు. కానీ, అందుకు తాను నిరాకరించానని వెల్లడించారు. ఈయన గురించి వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. అనేక మంది రాజేశ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన చూపిస్తున్న విధేయత, దైవభక్తి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని