Lottery: ఆటోడ్రైవర్‌కు రూ.12 కోట్ల బహుమతి
కేరళలో ఓ ఆటోడ్రైవర్‌కు లాటరీలో రూ.12 కోట్ల బహుమతి లభించింది. ఈ మేరకు ఆదివారం ప్రకటించిన ఓనం బంపర్ లాటరీ ఫలితాల్లో టీఈ-645465 నంబరు టికెట్ బంపర్ బహుమతికి ఎంపిక అయింది. ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన అదృష్టవంతుడు
కేరళ ఓనం బంపర్ లాటరీలో వరించిన అదృష్టం
కోచి: కేరళలో ఓ ఆటోడ్రైవర్‌కు లాటరీలో రూ.12 కోట్ల బహుమతి లభించింది. ఈ మేరకు ఆదివారం ప్రకటించిన ఓనం బంపర్ లాటరీ ఫలితాల్లో టీఈ-645465 నంబరు టికెట్ బంపర్ బహుమతికి ఎంపిక అయింది. ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన అదృష్టవంతుడు కోచి సమీపంలో మరాడుకు చెందిన ఆటో డ్రైవర్ పీఆర్ జయపళన్ అని సోమవారం వెల్లడైంది. ‘‘ఈ టికెట్‌ను సెప్టెంబరు 10న త్రిప్పునితురలో కొనుగోలు చేశాను. ఈ నంబర్‌కు బహుమతి లభిస్తుందని అప్పుడే భావించాను’’ అని జయపళన్ విలేకరులకు తెలిపారు. రూ.12 కోట్ల బహుమతి మొత్తంలో అన్నిరకాల పన్నులను మినహాయించగా రూ.7 కోట్లకుపైగా ఆయనకు దక్కుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు