Rain: వరుణ దేవుడి కరుణ కోసం.. బాలికల నగ్న ఊరేగింపు!

వర్షాలు కురిపించాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ బాలికలను నగ్నంగా వీధుల్లో తిప్పిన అనాగరిక ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అక్కడి దమోహ్‌ జిల్లాలోని బనియా గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన కంప్యూటర్‌

Updated : 07 Sep 2021 08:35 IST

దమోహ్‌: వర్షాలు కురిపించాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ బాలికలను నగ్నంగా వీధుల్లో తిప్పిన అనాగరిక ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అక్కడి దమోహ్‌ జిల్లాలోని బనియా గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన కంప్యూటర్‌ యుగంలోనూ కొనసాగుతున్న మూఢాచారాలకు అద్దం పడుతోంది. కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ గ్రామంలో ఓ ఆచారాన్ని పాటిస్తారు. అందులో భాగంగా బాలికలను నగ్నంగా మార్చి, కప్పను కట్టిన ఓ కర్రను వారి భుజాలపై పెట్టి, వీధుల్లో తిప్పుతూ మహిళలు భజనలు చేస్తారు. అలా ఆరుగురు బాలికలను నగ్నంగా తిప్పుతుండగా తీసిన వీడియోలు కలకలం సృష్టించాయి. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ మండలి(ఎన్‌సీపీసీఆర్‌) అప్రమత్తమైంది. ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని