Bald head: బట్టతలపై కొత్త వెంట్రుకలు!

సిరిసంపదలు ఎంత ఉన్నా, నెత్తిన జుట్టు లేకపోతే... ఆ లోటే వేరు! దీనికి పరిష్కారం కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. పట్నాలోని అఖిల భారత

Updated : 04 Nov 2021 07:09 IST

పట్నా: సిరిసంపదలు ఎంత ఉన్నా, నెత్తిన జుట్టు లేకపోతే... ఆ లోటే వేరు! దీనికి పరిష్కారం కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. పట్నాలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌), ఐఐటీలు కూడా సంయుక్తంగా దీనిపై దృష్టి సారించాయి. గామా కిరణాలతో బట్టతలపై వెంట్రుకలు పుట్టుకొచ్చేలా చేయవచ్చని, ఆ దిశగా తాము కృషి చేస్తున్నామని పరిశోధనకర్త డా.యోగేశ్‌ కుమార్‌ చెప్పారు. మహిళలు కూడా ఈ సమస్య కారణంగా తీవ్ర ఆత్మన్యూనతకు, అవమానాలకు గురవుతున్నారు. బట్టతల మూడు దశల్లో వస్తుందని డా.యోగేశ్‌ కుమార్‌ వివరించారు.

* అనాజెన్‌: ఇది మొదటి దశ. జుట్టు కుదుళ్లలో చీలికలు వస్తాయి. దీంతో వెంట్రుకలు పట్టు కోల్పోయి, రాలిపోతుంటాయి.

* కెటాజెన్‌: మొదటిదశ ఫలితంగా ఇది మొదలవుతుంది. రెండోదశలో జుట్టు పెరగడం తగ్గిపోతుంది. బట్టతల ఆనవాళ్లు కనిపిస్తాయి.

* టెలోజెన్‌: ఈ దశలో సమస్య తీవ్రంగా ఉంటుంది.కొత్త జుట్టు మొలవడమన్నదే ఉండదు.

*  హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా దుష్ప్రభావాల ముప్పు ఎక్కువ. వీటిని దృష్టిలో పెట్టుకుని... ఐఐటీ-పట్నాలోని ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో ప్రత్యేక గ్యాడ్జెట్‌ను ఏర్పాటుచేశారు. దీని ద్వారా గామా కిరణాలతో చికిత్స అందిస్తారు. టెలోజెన్‌ దశలో ఉన్న సమస్యను కెటాజెన్‌కు మారేలా చేస్తారు. తద్వారా బట్టతలపై కొత్త వెంట్రుకలు మొలవడం ప్రారంభమవుతాయని యోగేశ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని