AP News: ఏపీ అధికారులను అడ్డగించిన ఒడిశా

ఒడిశా, ఏపీ సరిహద్దు గ్రామాల్లో మరోసారి వివాదం నెలకొంది. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొఠియా గ్రామాలైన పట్టుచెన్నూరు, పగులుచెన్నూరుల్లో జగనన్న పచ్చతోరణం, ప్రభుత్వ భవన నిర్మాణాలకు

Updated : 17 Aug 2021 09:28 IST

కార్యక్రమాలను రద్దు చేసుకున్న సాలూరు ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో

సాలూరు గ్రామీణం, సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఒడిశా, ఏపీ సరిహద్దు గ్రామాల్లో మరోసారి వివాదం నెలకొంది. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొఠియా గ్రామాలైన పట్టుచెన్నూరు, పగులుచెన్నూరుల్లో జగనన్న పచ్చతోరణం, ప్రభుత్వ భవన నిర్మాణాలకు సోమవారం శంకుస్థాపన చేసేందుకు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ నిర్ణయించారు. విషయం తెలుసుకున్న ఒడిశాకు చెందిన పొట్టంగి, కొరాపుట్‌, జయపురం ఎమ్మెల్యేలు ప్రీతమ్‌పాఢి, రఘురామ్‌పడాల్‌, తారాప్రసాద్‌, భాజపా మాజీ ఎంపీ జయరాం పంగి, బిజద, కాంగ్రెస్‌ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. సరిహద్దులోని హర్మాడగి కూడలివద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, గోబ్యాక్‌ ఆంధ్రా అంటూ నినాదాలు చేస్తూ భైఠాయించారు. గ్రామానికి చేరుకుంటున్న పట్టుచెన్నూరు, పగులుచెన్నూరు కార్యదర్శులు శ్రీనివాసరావు, సురేశ్‌, వీఆర్వో శ్రీనివాసరావు, ఇద్దరు ఐటీడీఏ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను అడ్డుకున్నారు. విద్యా కానుక పంపిణీకి వెళ్లిన ఉపాధ్యాయుడు గణేశ్‌ను అడ్డగించి పుస్తకాలను లాక్కొని పంపించేశారు. దీంతో అధికారులంతా సాలూరు చేరుకున్నారు. దీనిపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ... సరిహద్దులో ఒడిశా నాయకులు, పోలీసులు మోహరించారని, అక్కడికి వెళ్లొద్దంటూ జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు సూచించడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని