PM Modi: జో బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ ఖరారు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. శుక్రవారం (సెప్టెంబర్‌ 24) ఇరు దేశాల అధినేతలు శ్వేతసౌధంలో సమావేశం కానున్నారు. ఈ మేరకు అధ్యక్ష భవనం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మోదీ అగ్రరాజ్య పర్యటన

Published : 21 Sep 2021 06:41 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. శుక్రవారం (సెప్టెంబర్‌ 24) ఇరు దేశాల అధినేతలు శ్వేతసౌధంలో సమావేశం కానున్నారు. ఈ మేరకు అధ్యక్ష భవనం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మోదీ అగ్రరాజ్య పర్యటన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. బైడెన్‌తో సమావేశంలో ద్వైపాక్షిక అంశాలతో పాటు.. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో అఫ్గాన్‌లో తలెత్తిన పరిస్థితులు, కొవిడ్‌-19 వ్యాక్సిన్‌.. తదితర విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదే రోజు క్వాడ్‌ కూటమి సదస్సుకు అమెరికా ఆతిథ్యమివ్వనుంది. ఇందులో మోదీ, బైడెన్‌, జపాన్‌ ప్రధాని సుగా యోషిహిడే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని